TSRTC offer on Mother's day : మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు టీఎస్ఆర్టీసీ మరో కానుక అందిస్తోంది. అన్ని ఆర్టీసీ సర్వీసుల‌్లో మాతృమూర్తులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే అన్ని బస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.
TSRTC MOTHERS DAY SPECIAL: ఆ అమ్మలకు...తెలంగాణ ఆర్టీసీ మరో కానుక - mothers day tsrtc offer 2022 in hyderabad
TSRTC offer on Mother's day : తెలంగాణ ఆర్టీసీ మహిళలకు మరో కానుకను ప్రకటించింది. ఆదివారం మాతృ దినోత్సవం సందర్భంగా వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే ఈ అవకాశమిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమంటూ ఆ త్యాగమూర్తి సేవలను గుర్తించుకుని మదర్శ్ డే సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు. ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులందరూ పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు అన్ని బస్సులలో ఈనెల 8వ తేదీన ఉచిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చని స్ఫష్టం చేశారు. మాతృ దినోత్సవం రోజున టీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎండీ సజ్జనార్ ట్విటర్ ద్వారా కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం: చంద్రబాబు