తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి.. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీలు కేకే, బండా ప్రకాష్, రంజిత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అన్ని కులాలు, వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుండాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మంత్రులు పేర్కొన్నారు. కులాలు ఆత్మగౌరవంగా జీవించాలనే.. సీఎం కేసీఆర్ భవనాలు నిర్మిస్తున్నారన్నారు.
జిల్లా కేంద్రాల్లో భవనాలకు స్థలాలు ఇచ్చేలా బాధ్యత తీసుకుంటానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం సుమారు 40 కులసంఘాలకు భవనాలు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి మత్స్యకారులుగా ఎన్‌రోల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.