ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాటల యుద్ధం.. ఏపీ గురించి కేటీఆర్‌ వాస్తవాలే మాట్లాడారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి - TS Vs AP Ministers

తెలంగాణ మంత్రి ప్రశాంత్​ రెడ్డి
Telangana Minister Prashant Reddy

By

Published : Apr 29, 2022, 4:05 PM IST

Updated : Apr 29, 2022, 5:13 PM IST

15:58 April 29

TS Vs AP Ministers: ఏపీ గురించి మంత్రి కేటీఆర్‌ ఉన్న విషయం చెబితే ఎందుకంత అక్కసు: ప్రశాంత్‌రెడ్డి

Minister prashanth reddy on AP: హైదరాబాద్‌లో విద్యుత్‌ కోతలతో జనరేటర్‌ వాడుతున్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ గురించి మంత్రి కేటీఆర్‌ ఉన్న విషయం చెబితే ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. ‘మంత్రి కేటీఆర్‌.. ఆంధ్రప్రదేశ్‌ గురించి ఉన్న నిజమే చెప్పారు. ఏపీని అభివృద్ధి చేస్తే మేమేమైనా అడ్డుపడుతున్నామా?. విజయవాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైదరాబాద్‌ వస్తున్నారు. తెరాస హయాంలో రోడ్లు బాగున్నాయని ప్రజలకు తెలుసు. ఏపీ మంత్రి బొత్స కుటుంబం కూడా హైదరాబాద్‌లోనే ఉంటుంది అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

MP Ranjith Reddy on Minister Bosta:హైదరాబాద్​లో కరెంట్​ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఎంపీ రంజిత్‌రెడ్డి స్పందించారు. బొత్స కరెంట్‌ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసి ఉంటారని వ్యంగంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో రెండు నిమిషాలు కూడా కరెంట్‌ పోదని.. ఆ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న వైకాపా నేతలను అడిగితే చెప్తారని రంజిత్‌రెడ్డి అన్నారు.

KTR Comments on AP: క్రెడాయ్‌ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. ‘పక్క రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. పక్క రాష్ట్రం వెళ్లి మీరే చూడండి. అక్కడికి వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు. కొన్ని మాటలంటే కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ.. అవి వాస్తవాలు’’ అని ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపాయి. దీనిపై ఏపీ మంత్రులు బొత్స, పెద్ద రెడ్డి, అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు స్పందించారు. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు.

ఇదీ చదవండి:

Last Updated : Apr 29, 2022, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details