ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

inter halltickets: నేటి నుంచి ఇంటర్ హాల్ టికెట్స్.. - ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల హాల్‌ టికెట్లు

తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్​ బోర్డు వెబ్​సైట్​లో సాయంత్రం ఐదు గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

inter halltickets
inter halltickets

By

Published : Oct 19, 2021, 11:01 AM IST

తెలంగాణలో నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి tsbie.cgg.gov.in. వెట్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. హాల్‌టికెట్లపై పొందుపర్చిన వివరాల్లో తప్పులుంటే కళాశాల ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 25 నుంచి నవంబరు 3 వరకు జరగనున్నట్లు జలీల్ తెలిపారు. హాల్ టికెట్లలో ఏమైనా వివరాలు తప్పు ఉంటే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హాల్ టికెట్​పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతి ఇవ్వాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేశారు.

కరోనా వల్ల గతేడాది పరీక్షలు వాయిదా

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు అక్టోబరు 25వ తేదీ నుంచి జరగనున్నాయి. 2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గతంలో కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే వారంతా ప్రమోట్‌ అయ్యారు. అప్పట్లో పరిస్థితులు అనుకూలించిన తరువాత మొదటి సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. తొలుత ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్​కే పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి:vishaka steel protest: 250వ రోజు ఉక్కు ఉద్యమం.. 25 గంటల నిరవధిక దీక్ష చేపట్టిన కార్మికులు

ABOUT THE AUTHOR

...view details