ధరణిలో ఆస్తుల వివరాల నమోదుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ కోసం ఆధార్ వివరాలు అడుగుతున్నారని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆధార్ వివరాలను ఏ రూపంలోనూ సేకరించవద్దని ఆదేశాలు జారీచేసింది. ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగబోమన్నారని గుర్తుచేసింది. హామీని లిఖితపూర్వకంగా సమర్పించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.