TS High Court on Munugode voter list: మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణపై నివేదిక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోర్టుకు సమర్పించారు. 2018 అక్టోబరు 12న మునుగోడు ఓటర్లు 2,14,847 ఉన్నట్లు సీఈవో తెలిపారు. ఈనెల 11 నాటికి మునుగోడు ఓటర్లు 2,38,759 ఉన్నారని వెల్లడించారు. 25,013 కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 12,249 కొత్త ఓటర్లకు అనుమతించి..7247 తిరస్కరించామని కోర్టుకు చెప్పారు. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తవుతుందని వివరించారు.
మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని ధర్మాసనం పేర్కొంది. మునుగోడు ఓటరు జాబితాపై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.