కేంద్ర జలశక్తి శాఖ(Ministry of Jal Shakti) జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్(Gazette Notifications For KRMB, GRMB) ప్రకారం ఈ నెల 14న ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించాల్సి ఉంది. ఇందుకోసం కృష్ణా(KRMB), గోదావరి బోర్డు(GRMB)ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందాయి. గోదావరికి సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టు ఉండగా... కృష్ణాకు సంబంధించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు చెందిన9 ఔట్‌లెట్లు ఉన్నాయి. వీటిలో వేటిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బోర్డులకు అప్పగించలేదు. ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన బోర్డు సమావేశాల్లోని మినిట్స్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పరిధిలోని ఔట్‌లెట్లను స్వాధీనం చేసేందుకు షరతులతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది.
వెంటనే ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదు..
అయితే తెలంగాణ((TELANGANA GOVERNMENT)) మాత్రం ప్రాజెక్టుల అప్పగింతపై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. బోర్డుల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి లేదని... చాలా సున్నితమైన, గంభీరమైన నదీజలాల అంశాని(WATER DISPUTES)కి సంబంధించి విస్తృతంగా చర్చించాల్సి ఉంటుందని, ప్రభావాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ప్రాజెక్టుల నిర్వహణ అంటే..
ప్రధానంగా కృష్ణా జలవివాదాల(krishna water dispute)కు సంబంధించి బచావత్ ట్రైబ్యునల్(bachawat tribunal) ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని... ఆ ఆధారంగానే ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి ఏ మేరకు ఇవ్వవచ్చన్న అంశంపై పూర్తి స్థాయిలో చర్చించాల్సి ఉంటుందని అంటున్నారు అధికారులు. ప్రాజెక్టుల నిర్వహణ అంటే కేవలం నీటి విడుదల, నిర్వహణ మాత్రమే కాదని... ఎన్నో ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయని సర్కార్ అంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర జలసంఘం((Ministry of Jal Shakti)) ఇచ్చిన ముసాయిదా నిబంధనలు, ఆపరేషన్ ప్రోటోకాల్‌ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.