ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KCR - STALIN MEET: తమిళనాడు సీఎం స్టాలిన్​తో తెలంగాణ సీఎం కేసీఆర్​ భేటీ - telangana cm meet tamilnadu cm

తమిళనాడు సీఎం స్టాలిన్​తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ భేటీ అయ్యారు. కేంద్రంలోని భాజపా వైఖరి, ధాన్యం కొనుగోళ్లలో విధానం, రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంబంధాలపైన చర్చించినట్లు సమాచారం. సోమవారం.. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి త‌మిళ‌నాడులోని తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగం వెళ్లిన కేసీఆర్.. రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో ప్రత్యేక పూజ‌లు చేశారు.

KCR - STALIN MEET
KCR - STALIN MEET

By

Published : Dec 14, 2021, 7:47 PM IST

తమిళనాడు సీఎం స్టాలిన్​తో తెలంగాణ సీఎం కేసీఆర్​ భేటీ

KCR - STALIN MEET: తమిళనాడు సీఎం స్టాలిన్​తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ భేటీ ముగిసింది. కేంద్రంలోని భాజపా వైఖరి, ధాన్యం కొనుగోళ్లలో విధానం, రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంబంధాలపైన చర్చించినట్లు సమాచారం. భాజపా వ్యతిరేక కూటమిపైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. గోదావరి, కావేరి నదుల అనుసంధానం సైతం చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. తెరాస బలోపేతానికి వీలుగా, తమిళనాడులో డీఎంకే పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కేసీఆర్ తెలుసుకున్నట్లు సమాచారం.

సోమవారం.. ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి త‌మిళ‌నాడులోని తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగం వెళ్లిన కేసీఆర్.. రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో ప్రత్యేక పూజ‌లు చేశారు. రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆలయంలోని గ‌జ‌రాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గత రెండేళ్లలో రెండోసారి శ్రీరంగ ఆలయానికి వచ్చినట్లు కేసీఆర్‌ తెలిపారు. స్వామివారిని దర్శించుకొని వెళ్తే ఎంతో శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు.

ఇదీచూడండి: Old Age Pensions Hike in AP: జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను పెంపు

ABOUT THE AUTHOR

...view details