ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRS MEETING : తెరాస విజయగర్జన సభ...మరోసారి వాయిదా

తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభ(TRS Vijaya Garjana News) మరోసారి వాయిదా పడింది. ఈనెల 29న జరగాల్సిన ఈ సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీక్షా దివస్ రోజున (నవంబర్​ 29) తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తే బాగుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సూచనతో ఈ నెల 29 నిర్వహించాలని నిర్ణయించారు.

తెరాస విజయగర్జన సభ
తెరాస విజయగర్జన సభ

By

Published : Nov 9, 2021, 7:12 PM IST

తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభ(TRS Vijaya Garjana News) మరోసారి వాయిదా పడింది. తెలంగాణలోని హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో రింగు రోడ్డు పక్కన ఈనెల 29న జరగాల్సిన ఈ సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ముందుగా ఈ నెల 15న విజయగర్జన సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీక్షా దివస్ రోజున (నవంబర్​ 29) తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిస్తే బాగుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కేసీఆర్​కు(cm kcr news) సూచించారు. వారి వినతి మేరకు నవంబర్​ 29 నిర్వహించాలని నిర్ణయించారు. ఓ వైపు సభ కోసం ఏర్పాట్లు చకచకా కొనసాగుతుండగా... ఎమ్మెల్సీ ఎన్నికల(MLC elections in telangana) నోటిఫికేషన్‌తో మరోసారి తెరాస సభ(TRS Vijaya Garjana News) వాయిదా పడింది.

సీఎం కేసీఆర్(CM KCR TOUR NEWS) రేపటి వరంగల్, హనుమకొండ పర్యటన కూడా వాయిదా పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్, హనుమకొండ జిల్లా​ల్లో పర్యటించాల్సి ఉంది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించేందకు సీఎం టూర్ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా... ఎన్నికల కోడ్ వల్ల ఈ పర్యటన కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు(MLC elections in telangana) నోటిఫికేషన్​ను ఈసీ విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించింది. 17వ తేదీన పరిశీలన చేస్తామని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఎమ్మెల్యేల కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న ఉ.9 నుంచి సా.5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెరాస విజయగర్జన సభ మరోసారి వాయిదా పడింది.

ఇదీ చదవండి:ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో జగన్ భేటీ.. వివాదాలపై కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details