TRS MPs met Piyush Goyal: దిల్లీ కేంద్రంగా వరిపోరును అధికార కేసీఆర్ ప్రభుత్వం మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే హస్తిన చేరుకున్న తెలంగాణ మంత్రులు కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యాచరణను ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెరాస ఎంపీలు.. రాజ్యసభ లాబీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో ప్రస్తావించిన ఎంపీలు.. నలుగులు రాష్ట్ర మంత్రులు దిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అపాయింట్‌మెంట్ ఇవ్వాలని పీయూష్‌ని ఎంపీ కె.కేశవరావు కోరారు. రేపు షెడ్యూల్ చూసుకుని పరిశీలిస్తానని కేంద్రమంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్.. మంగళవారం దిల్లీ వెళ్లారు. యాసంగి వరి దాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలవనున్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేనుంది. కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, సంబంధిత అధికారులను కలుస్తామని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొని వస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు.