ED attached Nama Nageshwar Rao properties: తెలంగాణలో తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్, ఖమ్మం, ఏపీలోని ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే పేరిట నామా నాగేశ్వరరావు రుణాలు తీసుకొని దారి మళ్లించారని ఈడీ ఆరోపించింది. సుమారు రూ.361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది.
ఆ కేసులో తెరాస ఎంపీ నామాకు ఈడీ షాక్.. రూ.80.66 కోట్లు జప్తు - Attach the assets of the deed
ED attached Nama Nageshwar Rao properties: తెలంగాణలో తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. తీసుకున్న రుణాలను మళ్లించినట్లు గుర్తించి.. ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
nama
నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో 6 డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో గతంలో నామాకు చెందిన రూ.73.43 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: