ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పీవీ నరసింహారావు బిడ్డను.. ఆశీర్వదించండి' - trs campaign for mlc elections in hyderabad

తన తండ్రి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడం గొప్పవరంగా భావించే.. ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి తెలిపారు. యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్‌పార్కులో ఎమ్మెల్యే గోపీనాథ్‌తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్కులో ఉదయపు నడకకు వచ్చిన వారితో పాటు... యోగా, వ్యాయామాలు చేస్తున్న వారిని సురభి కలిశారు. పీవీ కుమార్తెను అయినప్పటికీ... యువత, ఉద్యోగుల సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని వాణీదేవి వివరించారు.

surabhi vani devi
surabhi vani devi

By

Published : Feb 28, 2021, 3:07 PM IST

'పీవీ నరసింహారావు బిడ్డను.. ఆశీర్వదించండి'

'దేశ ప్రతిష్ఠను ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందేలా చేసిన పీవీ నరసింహారావు బిడ్డను ఆదరించాలి' అంటూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్లు సి.ఎన్.రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, సంగీత యాదవ్, దేదీప్యలతో కలిసి వాణీదేవి ప్రచారం నిర్వహించారు. పాదచారులతో పాటు యోగ, ఇతర వ్యాయామాలు చేస్తున్న వారిని కలిసి ముచ్చటించారు. తాను పీవీ కుమార్తెనే కాకుండా విద్యాసంస్థలు నడుపుతూ పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తినని సురభి పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

విష ప్రచారాలకు భయపడం..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించామని పేర్కొన్నారు. ఒకవైపు అభివృద్ధి.. మరొకవైపు శాంతిభద్రతలను పరిరక్షించడంలో తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సఫలీకృతం అయిందని తెలిపారు. భాజపా నాయకులు ఎంత విషప్రచారం చేసినా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇదీ చదవండి:

భర్తకు సెల్ఫీ వీడియో పంపి భార్య ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details