ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెరాస ఓడినందుకు మొక్కులు చెల్లించుకున్న ఆ పార్టీ నాయకుడు - దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు లేటెస్ట్​ వార్తలు

ప్రతిపక్షానికి నష్టం జరగాలని కోరుకోవడం సహజం కానీ... సొంత పార్టీ ఓటమి పాలైతే 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారో తెరాస నాయకుడు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గోదాల రంగారెడ్డి అనే గులాబీ పార్టీ సీనియర్ నాయకుడు సొంత పార్టీ ఓటమి పాలైనందకు మొక్కులు చెల్లించారు.

trs leader mokku
trs leader mokku

By

Published : Nov 11, 2020, 2:03 PM IST

ఎవరైనా తమ పార్టీ గెలవాలి, తమ నాయకుడు విజయం సాధించాలని తమ ఇష్టదైవాలను మొక్కుకుంటారు. అనుకూల ఫలితాలు వస్తే మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ తమ పార్టీ ఓడిపోవాలని ముడుపు కట్టాడో తెరాస నాయకుడు. దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి పాలైనందుకు లింగమంతుల స్వామి పెదగట్టు ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన తెరాస నాయకుడు రంగారెడ్డి... దుబ్బాకలో గులాబీ పార్టీ ఓటమి పాలైతే సమీపంలోని లింగమంతుల స్వామి పెదగట్టు ఆలయంలో 101 కొబ్బరి కాయలు కడతా అని ముడుపుకట్టారు.

దుబ్బాక ఫలితం వెలువడగానే మొక్కులు తీర్చుకున్నారు. తెదేపా, భాజపాలో 20 ఏళ్లుగా కొనసాగిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాని వీడి తెరాసలో చేరారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే ఉన్న ఆయన.. స్థానికంగా పార్టీలో ఉన్న అంతర్గత వివాదాల వల్ల గతకొంత కాలంగా క్షేత్రస్థాయి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో తన భార్య కోసం మున్సిపల్ ఛైర్​పర్సన్ సీటు ఆశించిన ఆయనకు అది దక్కలేదు. దీంతో ఇలా తెరాస ఓడిపోవాలని మొక్కుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details