ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

telangana: హుజూరాబాద్​లో తెరాసను కలవరపెడుతున్న "ఆ రెండు గుర్తులు" - తెలంగాణలో ఉప ఎన్నిక తాజా వార్తలు

తెలంగాణలో హుజూరాబాద్​ ఉప ఎన్నిక సమయం (huzurabad by election) దగ్గరపడే కొద్దీ ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రతి ఓటు కీలకం కావడంతో.. ఓటర్ల మదిలో తమ గుర్తును (party symbol) ముద్రించేందుకు అభ్యర్థులు యత్నిస్తున్నారు. గుర్తు మార్చుకుని బరిలోకి దిగిన ఈటలకు.. తన గుర్తును జనాళ్లోకి తీసుకెళ్లానా లేదా అనే భయం కలుగుతుంటే.. గతంలో జరిగిన ఎన్నికల్లో తమకు విజయాన్ని దూరం చేశాయి అనుకుంటున్న ఆ రెండు గుర్తులు మళ్లీ కనిపిస్తుండడంతో తెరాస శిబిరంలో కలవరం మొదలైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...

telangana
telangana

By

Published : Oct 19, 2021, 9:45 AM IST

ఎన్నికలు దగ్గర పడే కొద్ది అభ్యర్థులను అనేక రకాల భయాలు వెంటాడుతాయి. తన గుర్తు (party symbol) ప్రజల్లోకి వెళ్లిందా లేదా.. తన గుర్తు అనుకొని ఓటర్లు మరో గుర్తుకు ఓటేస్తారా..? అందరిని కలిసానా లేదా..? ఇలా ఎన్నెన్నో అనుమానాలు అభ్యర్థులను వెంటాడుతుంటాయి. గతంలో ఎన్నో సందర్భాల్లో గుర్తిన పోలిన గుర్తులు ఉండండం వల్ల ఫలితాలు తారుమారైన సంగతులు ఎన్నో చూశాం. అయితే ఈసారి తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికలో (huzurabad by election) విజయం తమదేనని ధీమాగా ఉన్న తెరాసను... ఇప్పుడు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు హడలెత్తిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన రోడ్డు రోలర్​, చపాతి రోలర్​ గుర్తులు (chapati roller and road roller symbols) ... తెరాసను కలవరపెడుతున్నాయి.

వాటిని చూడగానే మొదలైన కలవరం

హుజురాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా మొత్తం 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగిలిన 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల గుర్తులున్నాయి. వారితో పాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. స్వతంత్ర అభ్యర్థుల్లో (independent candidates) ఒకరికి రోడ్డు రోలర్, మరో అభ్యర్థికి చపాతి రోలర్ గుర్తులను (chapati roller and road roller symbols) ఇచ్చారు. ఇండిపెండెంట్​ అభ్యర్థులకు కేటాయించిన ఆ రెండు గుర్తులను చూడగానే తెరాస శ్రేణుల్లో కలవరం మొదలైంది.

గతంలో ఈ గుర్తులతోనే ముప్పు..!

2019 భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో (bhuvanagiri parlament election) తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komatireddy venkatereddy) 5వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఓ ఇండిపెడెంట్ అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు. ఆ అభ్యర్థికి ఏకంగా 27 వేల ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థి వల్లే ఓడిపోయామని ఆ సందర్భంలో తెరాస నాయకులు వాపోయాయి. ఈ తర్వాత మళ్లీ ఇదే సీన్ దుబ్బాకలో కూడా రిపీట్ అయింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత 1,079 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఈ ఎన్నికలో ఓ స్వతంత్ర అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తును కేటాయించారు. ఆ అభ్యర్థికి 3,570 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లో తెరాస ఓటమికి రోడ్డు రోలర్, చపాతి రోలర్ కారణమయ్యాయని ఇప్పటికీ ఆ పార్టీ నేతలు విలపిస్తున్నారు.

అదేసీన్​ రిపీట్​ అవుతుందా..!

ఇప్పుడు హుజురాబాద్‌ ఉప ఎన్నిక (huzurabad by election) సందర్భంగా ఇదే సీన్ రిపీట్ అవుతుందా అన్న అనుమానం తెరాస శ్రేణులను పీడిస్తోంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తెరాస శిబిరంలో గుబులు పుట్టిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రచారం హోరాహోరీగా సాగుతుండడం వల్ల ప్రతి ఓటు కీలకం కావడంతో ఈ గుర్తుల విషయమై చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చూడండి:

Badwel Bypoll: 30న బద్వేలు ఉపఎన్నిక.. నియోజకవర్గ పరిధిలో సెలవు

ABOUT THE AUTHOR

...view details