ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బండి సంజయ్​పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు - GHMC ELECTIONS NEWS

సీఎం కేసీఆర్​పై బండి సంజయ్​ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రఎన్నికల కమిషనర్​కు తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. సంజయ్​పై చర్యలు తీసుకోవాలని పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు.

trs complaint on bandi sanjay
బండి సంజయ్​పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

By

Published : Nov 20, 2020, 6:26 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సంజయ్ చట్టాలను ఉల్లంఘిస్తున్న దేశ ద్రోహి అని ధ్వజమెత్తారు. సవాల్ విసరాలనుకుంటే సంజయ్​కి చార్మినార్ వద్ద ఆలయమే దొరికిందా.. వేరే దేవాలయాలు లేవా అని ప్రశ్నించారు.

భాజపా నేతలు మాట్లాడే తీరు వారి సంస్కృతికి అద్దం పడుతోందని పల్లా మండిపడ్డారు. వరద సాయం ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మరోవైపు గెలిస్తే ఇంటికి 25 వేల రూపాయలు ఇస్తామంటున్నారన్నారు. భాజపా నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.

చలాన్లు రద్దు చేస్తామని భాజపా నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. వాటిని పెంచిందే కేంద్ర ప్రభుత్వమని పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు బుద్ధి చెప్పడం ఖాయమని పల్లా రాజేశ్వర్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.

ఇవీచూడండి:

తెలంగాణ: బండి సంజయ్​ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details