ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్సీ ఎన్నికలు: ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు - తీన్మార్​ మల్లన్న వార్తలు

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం ఓట్ల లెక్కింపు మూడో రౌండ్​ ముగిసేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 11687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15558 ఓట్లు రాగా.. తీన్మార్‌ మల్లన్నకు 11742 ఓట్లు వచ్చాయి.

ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు
ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు

By

Published : Mar 18, 2021, 2:42 PM IST

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం ఓట్ల లెక్కింపు మూడో రౌండ్​ ముగిసేసారికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 11687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15558 ఓట్లు రాగా.. తీన్మార్‌ మల్లన్నకు 11742 ఓట్లు వచ్చాయి. కోదండరాంకు 11039 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 5320 ఓట్లు, రాములు నాయక్‌ (కాంగ్రెస్‌)కు 4333 ఓట్లు పోలయ్యాయి.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో రెండో రౌండ్​ ఫలితాలు వచ్చాయి. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి 2613 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌడ్​లో వాణీదేవికి 35,171, రాంచందర్​ రావుకు 32,558, చిన్నారెడ్డికి 10,062, నాగేశ్వర్​ 16,951 ఎల్​.రమణకు 1,811 ఓట్లు వచ్చాయి.

ఇదీ చదవండి:

లైవ్ అప్​డేట్స్: కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక

ABOUT THE AUTHOR

...view details