ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రొటోకాల్ లొల్లి... భాజాపా, తెరాస బాహాబాహీ

తెలంగాణలో కొవిడ్​ వ్యాక్సిన్​ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్​ వివాదానికి తెరలేపింది. బ్యానర్​లో ప్రధాని మోదీ పొటో లేదంటూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కాస్తా తెరాస, భాజాపా శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది.

trsbjp
ప్రొటోకాల్ లొల్లి... భాజాపా, తెరాస బాహాబాహీ

By

Published : Jan 16, 2021, 9:53 PM IST

భాజాపా, తెరాస బాహాబాహీ

తెలంగాణలో కొవిడ్ వ్యాక్సిన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్​ భాజపా, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. బ్యానర్​లో ప్రధాని మోదీ ఫొటో లేదంటూ భాజాపా శ్రేణులు వరంగల్​ పట్టణంలో పలుచోట్ల ఆందోళనలకు దిగారు.

ఎంజీఎం ఆసుపత్రి వద్ద కట్టిన పలు బ్యానర్లు చించివేశారు. దేశాయ్​పేట ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చిన భాజపా కార్యకర్తలను తెరాస నాయకులు అడ్డుకోగా.. పరస్పరం తోపులాటలు జరిగాయి. కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

రానున్న ఎన్నికల నేపథ్యంలోనే భాజపా నాయకులు ఇలా అనవసరంగా గొడవలు సృష్టిస్తున్నారని తెరాస నాయకులు ఆరోపించారు. గతంలోనూ భాజపా నాయకుల పొటోలు లేవంటూ గొడవలు చేశారని.. ఇందంతా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనంటూ విమర్శించారు.

ఇదీ చదవండి:ఏపీ పోలీసుల తీరును అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాం: మాధవ్

ABOUT THE AUTHOR

...view details