టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం ముట్టడికి తెరాస కార్యకర్తలు యత్నించారు. తెరాస కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు గులాబీ కార్యకర్తలు యత్నించారు. వారిని అడ్డుకునేందుకు తెరాస శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలపై తెరాస కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పోలీసులు అడ్డుకున్నా.. వెనక్కి తగ్గలేదు.
రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత... తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం ముట్టడికి తెరాస కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో తెరాస, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఘర్షణ
డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేని మంత్రి కేటీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని తెరాస నేతలు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి