రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైకాపా శ్రేణులు - tribute to ys rajashekar reddy
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌కు ...వైకాపా శ్రేణులు నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు నాయకులు. పలుచోట్ల రక్తదాన శిబిరాలుఏర్పాటుచేశారు , రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదో వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నాయకులు నిర్వహించారు.శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలిలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు....ఆయన చేసినట్టుగా మరెవరూ జిల్లాను అభివృద్ధి చేయలేదన్నారు.విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు...పేదలకు దుప్పట్లు,చీరలు,రోగులకు పండ్లు పంపిణీ చేశారు.నెల్లూరు నగరంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్,ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ ను స్మరించుకున్నారు.అనంతపురంలో వైఎస్సార్‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి....రాయలసీమలో6లక్షల ఎకరాలకు నీరు ఇచ్చినప్పుడే వైస్ కు నిజమైన నివాళి అర్పించినట్టన్నారు.తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఎమ్మెల్యేపర్వత ప్రసాద్ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.