Jagan Cases: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - cm jagan latest news
17:24 September 14
కౌంటర్‌కు గడువు కోరిన సీబీఐ
హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలకు సీబీఐ గడువు కోరింది. బి.పి.ఆచార్య, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా పిటిషన్లపై కోర్టు విచారణను వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.
గృహనిర్మాణ ప్రాజెక్టు కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలకు సీబీఐ గడువు కోరింది. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. గృహనిర్మాణ ప్రాజెక్టుల కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. మరో వైపు విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాటానికి సీబీఐ గడువు కోరింది.
ఇదీ చదవండి