ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాను తిరిగి.. పట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. పట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయన ఏపీ హైకోర్టుకు బదిలీపై... 2021 అక్టోబర్ 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టులో ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆయనను స్వరాష్ట్రానికి బదిలీ చేస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా... 1991 సెప్టెంబర్‌లో న్యాయవాదిగా పట్నా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2011 జూన్ 20న పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
పట్నా హైకోర్టుకు జస్టిస్ అనుముల్లా బదిలీ !
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాను తిరిగి.. పట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
పట్నా హైకోర్టుకు జస్టిస్ అనుముల్లా బదిలీ