రాష్ట్రంలో నలుగురు నాన్ కేడర్ ఎస్పీలకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెయిటింగ్లో ఉన్న పలువురు ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఎస్పీ టి. పనసరెడ్డిని తిరుపతి ఆర్ఎస్‌ఏఎస్‌టీఎఫ్ ఎస్పీగా నియమించారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న వై.రవిశంకర్ రెడ్డిని.. ఏపీ జెన్‌కో ఎస్పీగా బదిలీ చేశారు.
రాష్ట్రంలో నలుగురు నాన్ కేడర్ ఎస్పీల బదిలీ - AP Home department news
రాష్ట్రంలో నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లోని పలువురు ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె.పి.లక్ష్మీనాయక్ నియామకమయ్యారు. ఏపీ జెన్‌కో ఎస్పీగా.. ఇంటెలిజెన్స్ ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నాన్ కేడర్ ఎస్పీల బదిలీ
వెయిటింగ్లో ఉన్న ఎం.సుందరరావును ఐఎస్‌డబ్ల్యూ ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమించారు. వెయిటింగ్లో ఉన్న ఎస్పీ కె.పి.లక్ష్మీనాయక్‌ను ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమించారు. వెయిటింగ్లో ఉన్న వి.గీతాదేవిని అనంతపురం పీటీసీ వైస్ ప్రిన్సిపల్‌గా నియమించారు.
ఇదీ చదవండీ... మరికొద్ది గంటల్లో అతితీవ్ర తుపానుగా 'యాస్'