ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LIVE VIDEO: డీజే ఆపినందుకు ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి - young men attacked trainee si in nalgonda

తెలంగాణలోని నల్గొండ జిల్లా డిండి మండలం బురాన్​పూర్ తండాలో దారుణం జరిగింది. పెట్రోలింగ్​లో భాగంగా.. సోమవారం రాత్రి బురాన్​పూర్ తండా వెళ్లిన పోలీసులు.. కొందరు యువకులు డీజే పెట్టుకుని నృత్యాలు చేయడం గమనించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వారిని పోలీసులు హెచ్చరించారు. ఆగ్రహించిన యువకులు ఓ ట్రైనీ ఎస్సైపై దాడి చేశారు.

attack
డీజే ఆపినందుకు ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి

By

Published : Jun 15, 2021, 8:21 PM IST

LIVE VIDEO: డీజే ఆపినందుకు ట్రైనీ ఎస్సైపై యువకుల దాడి

తెలంగాణలోని నల్గొండ జిల్లా డిండి మండలం బురాన్​పూర్ తండాలో దారుణం జరిగింది. పెట్రోలింగ్​లో భాగంగా.. సోమవారం రాత్రి బురాన్​పూర్ తండా వెళ్లిన పోలీసులు.. అక్కడ జరుగుతున్న ఓ వివాహ వేడుకలో కొందరు యువకులు గుంపులు గుంపులుగా చేరి.. డీజే పెట్టుకుని నృత్యాలు చేయడం గమనించారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా విధించిన లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వారిని పోలీసులు హెచ్చరించారు. నృత్యాలు ఆపివేయాలని ఆదేశించారు. ఇదేం లెక్కచేయని యువకులు ట్రైనీ ఎస్సై కిరణ్​పై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. పోలీసు వాహనంపై అక్కడే ఉన్న కుర్చీలతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.అతి కష్టం మీద పోలీసులు అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులపై దాడికి దిగిన 10 మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు

ABOUT THE AUTHOR

...view details