మెట్ల పైనుంచి దిగుతూ కాలుజారి కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్‌లో చోటు చేసుకుంది. కుమారుడి మరణవార్త జీర్ణించుకోలేక తండ్రి గుండెపోటుతో చనిపోయారు. మక్తల్ వినాయక్ నగర్లో జావిద్.. ఇంటి మేడపై చరవాణిలో ఆన్లైన్ క్లాసులు విని మెట్ల పైనుంచి కిందికి దిగుతుండగా కాలుజారి కింద పడ్డాడు.
మెట్ల పైనుంచి కిందపడి కుమారుడు.. గుండెపోటుతో తండ్రి - నారాయణపేట నేర వార్తలు
ఒకే కుటుంబంలో కుమారుడు, తండ్రి మరణించిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్‌లో చోటు చేసుకుంది. ఇద్దరి మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణలో దారుణం
తలకు బలమైన గాయం తగలగా.. చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇంటి దగ్గర ఉన్న తండ్రి అన్వర్... కొడుకు మరణ వార్త విని గుండెపోటుతో అక్కడికక్కడే మరణించారు. కుటుంబంలో ఇద్దరు చనిపోగా.. విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి :నేడు సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష