హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి(rains in Hyderabad) రెండు కిలోమీటర్ల పొడవునా వందల వాహనాలు నిలిచిపోయాయి. ఈ రద్దీలో(traffic in Hyderabad) అయిదు అంబులెన్సులు(ambulance) చిక్కుకుపోయాయి. అరగంట పాటు అవి ఎటూ కదిలేందుకు వీలు కాలేదు. వాటిలోని రోగుల ప్రాణాలు విలవిల్లాడాయి. అంబులెన్సులకు దారి ఇవ్వాలని వాహనదారులందరికీ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే కదిలారు రక్షకభటులు(telangana police). ఓవైపు మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు చాదర్‌ఘాట్ పోలీసులు పది మంది ఎక్కడికక్కడ వాహనాల్ని కట్టడి చేశారు. హోంగార్డు బాలాజీ కాళ్లకు చెప్పులు లేకుండానే అంబులెన్సుల ముందు వాహనాల్ని పక్కకి తప్పిస్తూ పరుగులు పెట్టారు. వేరే మార్గంలోకి అంబులెన్సులను మళ్లించారు.
Police : పరుగులు పెట్టారు...ప్రాణాలు నిలబెట్టారు
తెలంగాణలోని భాగ్యనగరంలో ఓవైపు కుండపోత వర్షం(rains in Hyderabad). మరోవైపు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. ఇంతటి రద్దీలో(traffic in Hyderabad) చిక్కుకుపోయాయి అయిదు అంబులెన్సులు(ambulance). అందులోని రోగుల ప్రాణాలు విలవిల్లాడాయి. సరిగ్గా ఇదే సమయానికి ముందుకొచ్చారు పోలీసులు(ts police). కాళ్లకు చెప్పులు లేకుండా... వాహనాలను పక్కకు తప్పించారు. అలా పరుగులు పెట్టి... ప్రాణాలు నిలబెట్టారు.
పోలీసుల ప్రయత్నాలతో కొద్దిసేపట్లోనే అవి ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడి ఆస్పత్రులకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మలక్‌పేట నుంచి కోఠి వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిందీ సంఘటన. మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వానలకు ఈ దారిలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి వాహనదారులు నరకం చూశారు. ఈ స్థితిలో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు నిమిషాల వ్యవధిలో అంతా చక్కబెట్టారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, మలక్‌పేట ట్రాఫిక్ సీఐ జ్యోత్స్న దగ్గరుండి పర్యవేక్షించారు. అంబులెన్సులను దాటించేందుకు పోలీసులు పడిన తపనను, హోంగార్డు బాలాజీ చూపిన చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.