హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. సూర్యాపేట రిలయన్స్ పెట్రోల్ బంకు నుంచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గొల్లగట్టు లింగమంతులస్వామి జాతర వద్ద ట్రాఫిక్‌ను పోలీస్ సిబ్బంది నియంత్రిస్తున్నారు. జాతర దృష్ట్యా ముందే ట్రాఫిక్‌ను మళ్లించినప్పటికీ... ట్రాఫిక్ జాం కావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జాం - ట్రాఫిక్ జాం
తెలంగాణలోని గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2 కి.మీ. మేర వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జాం
జాతర ప్రారంభం ముందురోజు నుంచే.. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలను... నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లే వాటిని... కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా పంపుతున్నారు. అయినా స్థానికంగా రద్దీ పెరిగే వాహనాలు నిలిచిపోయాయి.