Traffic at Hyderabad-Vijayawada Highway: సంక్రాంతి పండుగకు ఇంకా వారమే సమయం ఉంది. విద్యార్థులకు సెలవులు కూడా వచ్చేశాయి. ఇంకేం జనం సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. శనివారం నుంచి సెలవులు రావడంతో భారీ సంఖ్యలో జనం భాగ్యనగరం నుంచి పల్లె బాట పట్టారు. ఫలితంగా ఆ హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగింది.
Traffic at Hyderabad-Vijayawada Highway: సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
Traffic at Hyderabad-Vijayawada Highway: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ ఇంకా వారం ఉండగానే జనం పల్లెబాటపడుతున్నారు. ఇక శనివారం నుంచి విద్యార్థులకు సెలవులు రావడంతో భారీ సంఖ్యలో ఊరెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.
సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
మరోవైపు హైదరాబాద్-విజయవాడ రహదారిపై దట్టంగా పొగమంచు కమ్మేసింది. మంచుదుప్పటి కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీ దృష్ట్యా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపు కేంద్రాల పెంచారు. ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే భారీగా వాహనాల రాకపోకలు పెరిగాయి.
ఇదీ చదవండి:పండక్కి ఊరెళ్తున్నారా..? ఇళ్లు గుల్లవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!