Revanth Reddy House Arrest : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఆయన వరంగల్ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రకటించడంతో రేవంత్‌ను గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి రేవంత్ బయటకు రాకుండా అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
Revanth Reddy House Arrest Today : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొండపల్లి దయాసాగర్ తండ్రి దశదిన కర్మకు వెళ్లడంతో పాటు.. ఇటీవల శబరిమలలో చనిపోయిన కాంగ్రెస్ నాయకుడు చరణ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వరంగల్ వెళ్లనున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇవాళ వరంగల్ శివార్లలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని అంతకుముందు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే.. డిసెంబర్ 31న అని పోలీసులు రచ్చబండ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. వరంగల్ వెళ్తానని ప్రకటించిన రేవంత్... రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న అనుమానంతో పోలీసులు రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో గృహనిర్బంధం చేశారు.
Revanth Reddy Warangal Tour : పోలీసులను చూసి బయటకు వచ్చిన రేవంత్‌ను వారు అడ్డుకున్నారు. తన ఇంటి ఆవరణలో భారీగా పోలీసులు మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా తన ఇంట్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.