ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Revanth Reddy Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ - Revanth Reddy Arrested at his residence

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్​కు రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

Revanth Reddy Arrest
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్

By

Published : Feb 17, 2022, 11:16 AM IST

Revanth Arrested : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్​లోని నివాసంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్​కు రేవంత్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

రేవంత్ అరెస్టు అప్రజాస్వామికం

Revanth Arrest News : రేవంత్ రెడ్డి అరెస్టును పలువురు టీపీసీసీ నేతలు ఖండించారు. రేవంత్ అరెస్టు అక్రమమని, అప్రజాస్వామికమని మహేశ్ కుమార్, మల్లు రవి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్బంధకాండ అమలవుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌ సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్ష నేతలకు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details