ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాంగ్రెస్​లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం: రేవంత్‌ రెడ్డి - మీడియాతో రేవంత్​ రెడ్డి ఇష్టాగోష్ఠి

తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చాలామంది తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు తెలిపారు.

revanth chit chat
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

By

Published : Jul 13, 2021, 8:41 PM IST

తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చాలామంది తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు తెలిపారు. తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. కేసీఆర్ తెరాసలోకి తీసుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఇవాళ ముగ్గురు నేతలు తమను కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారని.. అందులో భాజపా ఎంపీ ధర్మపురి అర్​వింద్​ సోదరుడు నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ ముదిరాజ్‌, భూపాల్‌పల్లికి చెందిన తెదేపా మాజీ నేత గండ్ర సత్యనారాయణ ఉన్నట్లు వివరించారు. మూడు వర్గాలకు చెందిన నాయకులు పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.

కౌశిక్‌ చిన్న పిల్లవాడు.. ఆ మాటలు అతనివి కావు.. కేసీఆర్‌ మాట్లాడించినవని. కౌశిక్‌ రెడ్డి తెరాసతో టచ్‌లో ఉన్నట్లు నాకు ముందే తెలుసు. అక్కడ కౌశిక్‌ రెడ్డికి తెరాస టికెట్ ఇస్తుందని అనుకోవడం లేదు. తెరాసకు అభ్యర్థి కరవయ్యాడు, అందుకే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఇప్పుడే చెప్పం. _టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

నిన్నటి పెట్రోల్‌, డీజిల్‌ పెంపుపై నిరసన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చినట్లు రేవంత్ పేర్కొన్నారు. ఇదే జోష్​లో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ARREST: తిరుపతిలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు చైనా పౌరులు అరెస్టు

CM JAGAN: 'గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్ నిర్మాణం ఈ ఏడాది పూర్తి కావాలి'

ABOUT THE AUTHOR

...view details