ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇంటి దొంగలను వదిలేది లేదు.. నిఖార్సైన కార్యకర్తలను వదులుకునేది లేదు' - నిర్మల్​లో కాంగ్రెస్​ ర్యాలీ

కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను వదిలేది లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కోసం కష్టపడిన వారిని వదులుకునేది లేదని, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని అన్నారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణలోని నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

tpcc
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

By

Published : Jul 12, 2021, 9:38 PM IST

కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను వదిలేది లేదు: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలు ఉంటే పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పెట్రోల్‌ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. "ఈ నెలాఖరు వరకు అవకాశం ఇస్తున్నా.. ఎవరైనా ఇంటిదొంగలు ఉంటే పారిపోండి. లేదంటే పద్ధతి మార్చుకోండి" అన్నారు. అధికారంలో ఉన్నామని తమ కార్యకర్తలు వేధిస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌ లక్కీ నంబర్‌ 6, తన లక్కీ నంబర్‌ 9 అని చెప్పిన రేవంత్... ఆరు నంబర్‌ను తిరగేస్తే 9 అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో నిర్మల్‌ నుంచి మహేశ్వర్‌ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఉద్యమాలతో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్​లో ఎవరైనా ఇంటిదొంగలుంటే వదిలిపెట్టేది లేదు. పార్టీకోసం కష్టపడేటోడుంటే వదులుకునేది లేదు. కాంగ్రెస్​ కోసం కష్టపడేవాళ్లను గుండెల్లో పెట్టుకుని, దగ్గరకు చేర్చుకుని చూసుకునే బాధ్యత మాది. ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే నెలాఖరు వరకు సమయమిస్తున్నాం.. ఎవరైనా ఉంటే పారిపోండి. లేకపోతే మీ బుద్ధి మార్చుకోండి. కష్టపడేవాళ్లు పదిమంది ఉన్నా చాలు. తెలంగాణ రాష్ట్రంలో కౌరవుల ప్రతినిధిగా తెరాస ఉంటే... రాష్ట్రం ఇచ్చిన వాళ్లుగా, రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగాలు చేసినవాళ్లుగా మనం పాండవుల ప్రతినిధిగా ఉన్నాం. ధర్మం కాంగ్రెస్​ వైపు ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ గెలుస్తుంది. కచ్చితంగా హుజూరాబాద్​లో కాంగ్రెస్​ పార్టీ ప్రజల దగ్గరకు వెళ్తుంది. ఇద్దరు దొంగల బండారం బయట పెడుతుంది. - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details