ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

REVANTH REDDY: 'కృష్ణా జలాల్లో 34 % చాలని.. మంత్రిగా ఆనాడు హరీశ్‌ సంతకం పెట్టారు' - telangana latest news

కృష్ణా జలాలను కాపాడటం కంటే తెలంగాణ సీఎం కేసీఆర్​కు పెద్ద పనులు ఏమున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు జీవో 203 ఇచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని తెలిపారు. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారని పేర్కొన్నారు.

water war between telugu states
రాష్ట్రానికి 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారు

By

Published : Jul 4, 2021, 5:37 PM IST

'రాష్ట్రానికి 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారు'

తమకు ఏనాడూ 50 శాతం నీళ్లు కావాలని తెలంగామ ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. తమకు 34 శాతం నీళ్లు కావాలని చెప్పిందే కేసీఆర్​ అని.. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్‌ సంతకం పెట్టారని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణలో గత 7 ఏళ్లలో కేవలం 299 టీఎంసీలు వాడుకున్నామని అన్నారు.

రాయలసీమ ఎత్తిపోతలకు 203 జీవో ఇచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని రేవంత్‌ తెలిపారు. ఆ ప్రాజెక్టుకు ఏపీ సీఎం జగన్ నిధులిచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు రైతు... ఎన్జీటీని నుంచి స్టే తెచ్చారని గుర్తు చేశారు.

మోదీ సర్కారును అన్ని విషయాల్లో కేసీఆర్‌ సమర్థించారని రేవంత్‌రెడ్డి అన్నారు. జులై 9న బోర్డు సమావేశానికి రమ్మంటే.. జులై 20న బోర్డు భేటీ ఏర్పాటు చేయాలని సీఎం అంటున్నారని విమర్శించారు. కృష్ణా జలాలను కాపాడటం కంటే కేసీఆర్​కు పెద్ద పనులు ఏమున్నాయని రేవంత్​రెడ్డి నిలదీశారు.

ఇదీ చూడండి:

'నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోండి'

ABOUT THE AUTHOR

...view details