హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad by elections) తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Interesting Comments) జోస్యం చెప్పారు. 2022 ఆగష్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) కూడా జరుగుతాయని తెలిపారు. కేసీఆర్ (Cm Kcr) కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారని రేవంత్ అన్నారు. సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి(Revanth Reddy Chitchat)గా మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు చివరకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమేనన్నారు. హరీశ్‌రావును పూర్తిగా ఇంటికి పంపే ప్రణాళికను కేసీఆర్ రెడీ చేశారని పేర్కొన్నారు.
తిరుగుబాటును ఎదుర్కోవడానికే కేసీఆర్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల చర్చ ఎందుకు తీసుకొచ్చారో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకో రెండున్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ఎమ్మెల్యేలను భయపెడుతున్నట్లు వివరించారు. మళ్లీ తెరాస అధికారంలోకి వస్తోందని రెండేళ్ల ముందే కేసీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో భాజపాను బలోపేతం చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.