రెండో దశలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా రామోజీ ఫిల్మ్ సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక కార్యకలాపాలను ఏప్రిల్ 21వ తేదీ బుధవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. మళ్లీ తెలిపే వరకూ పర్యాటకుల రాకపోకలు ఉండబోవని ఫిల్మ్ సిటీ ప్రతినిధులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో పర్యాటకం తాత్కాలికంగా నిలిపివేత - tourism suspend in ramoji film city news
కరోనా కారణంగా రామోజీ ఫిల్మ్ సిటీలో పర్యాటక కార్యకలాపాలు తాత్కాలికంగా మూతపడ్డాయి.. గతేడాది లాక్డౌన్ సమయంలో ఫిల్మ్ సిటీలో పర్యాటకాన్ని నిలిపివేసిన సంస్థ... లాక్డౌన్ అనంతరం ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు పర్యాటకాన్ని పునఃప్రారంభించారు. కరోనా రెండో దశ వలన ఇప్పుడు తాత్కాలికంగా పర్యాటక కార్యాకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఫిల్మ్ సిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
![రామోజీ ఫిల్మ్‌సిటీలో పర్యాటకం తాత్కాలికంగా నిలిపివేత ramoji film city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11480697-232-11480697-1618973277290.jpg)
రామోజీ ఫిల్మ్‌సిటీ