ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారు 50 శాతం వడ్డీ కట్టక్కర్లేదు! - పర్యటక రంగంలో ఏపీ వార్తలు

కొవిడ్​తో కుదేలైన పర్యటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. రీస్టార్ట్ ప్యాకేజీపై పర్యటక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల రుణాలపై వడ్డీలు కేవలం 50 శాతం మాత్రమే చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది.

ap govt
50 శాతం వడ్డీ కట్టక్కర్లేదు

By

Published : Dec 29, 2020, 10:30 AM IST

పర్యాటక రంగంలో వివిధ ప్రైవేటు సంస్థలకు వాణిజ్య బ్యాంకుల నుంచి ఇప్పించే రుణాలపై వడ్డీలు... 50 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణం తీసుకున్న ఏడాది నుంచి ఈ రాయితీ వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగానికి చేయూతనిచ్చేందుకు గాను 198.7 కోట్ల ఉపశమన ప్యాకేజీని అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక రంగానికి సంబంధించి అన్ని ప్రాజెక్టులపై రీస్టార్ట్ ప్యాకేజీకు.. ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పర్యాటక రంగానికి సంబంధించి రీస్టార్ట్ ప్యాకేజీ పై పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,910 ప్రైవేట్ సంస్థలకు బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణాలపై బ్యాంకులు తొమ్మిది శాతం వడ్డీ చెల్లిస్తే అందులో 4.5 శాతం మేర ప్రభుత్వం సమకూర్చనుంది. ఇందుకోసం ప్రభుత్వం 8.92 కోట్లు ఖర్చు చేయనుంది.. దీంతో పాటు వడ్డీలో సగం మాత్రమే ప్రైవేట్ సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details