ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జూన్​ 8 నుంచి హోటళ్లకు అనుమతి.. నిబంధనల మేరకే కార్యకలాపాలు' - minister avanthi news latest press meet news

లాక్​డౌన్​ వల్ల పర్యాటక రంగం చాలా నష్టపోయిందని మంత్రి అవంతి శ్రీనివాస్​ అన్నారు. జూన్​ 8 నుంచి హోటళ్లు తిరిగి అనుమతిస్తామన్న ఆయన.. హోటల్​ యజమానులు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. కేంద్ర సూచనల మేరకే పర్యటక కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు.

'జూన్​ 8 నుంచి హోటళ్లకు అనుమతి.. నిబంధనల మేరకే కార్యకలాపాలు'
'జూన్​ 8 నుంచి హోటళ్లకు అనుమతి.. నిబంధనల మేరకే కార్యకలాపాలు'

By

Published : Jun 4, 2020, 4:57 PM IST

రాష్ట్రంలో జూన్​ 8 నుంచి హోటళ్లను తెరిచేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్​ తెలిపారు. కేంద్ర నిబంధనల మేరకు హోటళ్లు, పర్యటక కార్యకలాపాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వేళ పర్యాటకశాఖ నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందన్న ఆయన.. పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రాష్ట్రానికి తీర, అటవీ ప్రాంతాలు, హిల్​ స్టేషన్లు, రివర్​, టెంపుల్​ టూరిజం వంటి ప్రత్యేకతలున్నాయన్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ఉత్సవాలు నిర్వహించామని మంత్రి అవంతి తెలిపారు. పర్యాటక విభాగాన్ని ఆదాయం తెచ్చే శాఖగా మారుస్తామన్న ఆయన.. గండికోట, హార్స్‌లీహిల్స్, అరకు ప్రాంతాల్లో ఐదు, ఏడు నక్షత్ర హోటళ్లు నిర్మిస్తామని అన్నారు. పర్యాటక శాఖకు చెందిన హోటళ్లు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. హోటల్​ యజమానులు పర్యాటకులకు థర్మల్​ స్క్రీనింగ్​, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details