- రష్యా- ఉక్రెయిన్ కీలక చర్చలు- సంధి కుదిరేనా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు కీలక చర్చలు జరగనున్నాయి. రష్యా ప్రతినిధులతో సమాలోచనలు జరిపేందుకు ఉక్రెయిన్ బృందం బెలారస్ సరిహద్దుకు చేరుకుంది. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉక్రెయిన్- రష్యా చర్చలతో పుంజుకున్న సూచీలు.. సెన్సెక్స్ 350 ప్లస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 389 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు లాభపడ్డాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వివేకా కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషే: చంద్రబాబు
సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెదేపా అధినేత చంద్రబాబు. వివేకా కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందని ఆరోపించారు. హత్యను రాజకీయంగా వాడుకున్నారని.. ఇప్పటికైనా జగన్ బయటికొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- జగన్‌కు తెలిసే వివేకా హత్య జరిగింది: నారా లోకేశ్
సీఎం జగన్‌కు తెలిసే వివేకా హత్య జరిగిందని తెదేపా నేత నారా లోకేశ్ ఆరోపించారు. విశాఖ కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. తప్పుడు వార్తలు ప్రచురించారని సాక్షి పత్రికపై లోకేశ్ పిటిషన్ వేయగా.. ఆ కేసు ఇవాళ్టీకి వాయిదా పడింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అక్కడ హెర్డింగ్స్ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించండి: హైకోర్టు
కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్న కారణంతోనే విజయవాడ ఆటోనగర్‌లో తాను ఏర్పాటు చేసిన కరోనా హోర్డింగ్స్‌ను మున్సిపల్ అధికారులు తొలగించారని గద్దె రామ్మోహన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ధర్మాసనం విచారణ జరిపింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ