ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @1PM
ప్రధాన వార్తలు @1PM

By

Published : Jan 31, 2022, 1:00 PM IST

  • 'వ్యాక్సినేషన్​తో దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచవ్యాప్తం'
    కరోనా వైరస్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాడాయని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా భారత శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'దేశ ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి భరోసా ఇచ్చే సమావేశాలివి'
    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలు.. దేశ ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. భారత్​కు అనేక అవకాశాలు పొంచి ఉన్నాయని చెప్పారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • New Judges: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లు సిఫారసు
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈనెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పిస్తూ న్యాయమూర్తులుగా నియమించాలంటూ సిఫార్సు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • HEAVY FOG:గన్నవరంలో కమ్మేసిన పొగమంచు...విమాన సర్వీసులకు అంతరాయం
    గన్నవరంలో పొగమంచు కమ్మేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఏర్పాడ్డాయి. దిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం గాలిలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Navaratnalu:గృహ నిర్మాణాల పూర్తికి గడువు పొడిగింపు...ఎప్పటివరకంటే!
    ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. మొదటి విడతగా చేపట్టిన 15.75 లక్షల ఇళ్లకు 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన చేయగా ఈ ఏడాది డిసెంబరు నాటికి వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. 13 లక్షలు గృహాలు పునాది (గ్రౌండింగ్‌) దశలో ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అరగుండుతో యువతి ఊరేగింపు కేసులో మరో ట్విస్ట్​.. ఆమె సోదరిపై కూడా!
    దిల్లీ యువతిని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులు తనను కూడా లైంగికంగా హింసించారని బాధితురాలు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • మాజీ ఐపీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు- బేస్​మెంట్​లో 650 లాకర్లు!
    ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఇంటి బేస్​మెంట్​లో భారీగా నగదును గుర్తించారు ఐటీ శాఖ అధికారులు. బేస్​మెంట్ నుంచే ఓ కంపెనీని నడిపిస్తున్నట్లు కనుగొన్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సంస్థకు 650 లాకర్లు ఉన్నాయని వెల్లడించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 2 వేల కి.మీ ఎత్తుకు 'కిమ్' క్షిపణి... టార్గెట్ అమెరికా!
    ఆదివారం ప్రయోగించిన శక్తిమంతమైన క్షిపణి తాలూకు చిత్రాలను ఉత్తర కొరియా విడుదల చేసింది. రెండు వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన చిత్రాలను షేర్ చేసింది. ఈ మిసైల్​కు అమెరికా భూభాగాన్ని ఢీకొట్టే సత్తా ఉందని చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. విండీస్​దే సిరీస్​​
    ఇంగ్లాండ్​తో నిర్ణయాత్మక ఐదో టీ20లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​ ఆఖరి ఓవర్​లోని నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు విండీస్​ బౌలర్​ జేసన్​ హోల్డర్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • బాలీవుడ్​లో బన్నీ ధమాకా.. రూ.100 కోట్ల 'పుష్ప'
    అగ్రకథానాయకుడు అల్లు అర్జున్.. బాలీవుడ్​లో తన మార్క్​ క్రియేట్ చేశారు. 'పుష్ప' సినిమాతో రికార్డు స్థాయిలో రూ.100 కోట్లు సాధించారు. ప్రభాస్​ తర్వాత ఈ ఘనత అందుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details