- దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సీఎం జగన్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈనెల 14 నుంచి గెజిట్ అమల్లోకి..
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- '11వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు కోరాం'
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు(employees union leaders met government advisor Sajjala news). వారి సమస్యలపై.. సజ్జలతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు.. దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల
పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో.. ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి లక్షా 52 వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గంగమ్మకు భాజపా ద్రోహం చేసింది.. ప్రజలను మోసగించింది'
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల వేళ 'సమాజ్‌వాదీ విజయ్ యాత్ర'కు శ్రీకారం చుట్టారు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్. కాన్పూర్‌లో జరిగిన ర్యాలీలో భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. గంగమ్మకు భాజపా ప్రభుత్వం ద్రోహం చేసిందని, ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిరుతపులుల హోరాహోరీ ఫైట్
ఉత్తరాఖండ్‌లో రెండు చిరుతపులుల మధ్య భీకర పోరు సాగింది. రెండూ హోరాహోరీ తలపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శ్రీనగర్ జిల్లాలోని ఖిర్సు మార్గ్‌లో కారులో వెళుతున్న ప్రయాణికులు ఈ ఘటనను కెమెరాలో బంధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికాకు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్..
అజేయమైన సైన్యాన్ని నిర్మిస్తానని.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim news today) ప్రతిజ్ఞ చేశారు. ఆత్మరక్షణ కోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని స్పష్టం చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు అమెరికానే కారణం అని ఆరోపించారు కిమ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లకు లాభాలు
స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 149 పాయింట్లు పెరిగి 60,284 వద్దకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 46 పాయింట్ల లాభంతో 18 వేల మార్క్‌కు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఓటమితో బాధపడినా.. ఈ సీజనే ప్రత్యేకం'
ఈ సీజన్లో కప్పు సాధించేందుకు (virat kohli in ipl 2021) ప్రతి ఒక్కరం చాలా కష్టపడ్డామని అన్నాడు రాయల్ ఛాలెంజర్స్ సారథి విరాట్ కోహ్లీ. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో తాము నిరాశ చెందామనేది నిజమే అయినా ఎవరూ మనసు విరిగేంతగా బాధపడినట్లు కనిపించలేదని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మా'కు పోటీగా మరో అసోసియేషన్?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయలు ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటికే 'మా' సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్, నాగబాబు రాజీనామా చేయగా.. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులూ ఇదే బాట పట్టనున్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధానవార్తలు @5PM