ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - andhrapradesh news

.

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

By

Published : Aug 24, 2021, 7:00 PM IST

  • రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్‌

రమ్య హత్య ఘటనపై నిజనిర్ధారణ కోసం గుంటూరులో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన హడావుడిగా సాగింది. హత్య జరిగిన ప్రాంతాన్ని కమిషన్​కు చూపించకుండానే అధికారులు వారిని తీసుకెళ్లారు. రమ్య కుటుంబంతో మాట్లాడిన తర్వాత రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నుంచి వినతులు స్వీకరించారు. రమ్య హత్య కేసుని తీవ్రంగా పరిగణించామని... దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఎస్సీ కమిషన్ వైస్‌ ఛైర్మన్ అరుణ్ హెల్దేర్ పేర్కొన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ED RAIDS: వెంట్రుకల ఎగుమతి కంపెనీల్లో ఈడీ సోదాలు

వెంట్రుకలు ఎగుమతి చేసే కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఫెమా చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,248 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,715 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,677 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పేర్ని నానికి డ్రైవర్స్ అండ్ క్లినర్స్ హక్కుల సాధన సమితి వినతి పత్రం

రవాణా వ్యవస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు సహకరించాలని డ్రైవర్స్ అండ్ క్లినర్స్ హక్కుల సాధన సమితి సభ్యులు మంత్రిని కలిశారు. తమ తరఫున వాణి వినిపించాలని కోరారు. అమలుకు కొన్ని సూచనలు అందించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పెళ్లికి పిలవలేదని వరుడ్ని చితకబాదిన స్నేహితుడు

పెళ్లికి పిలవలేదని వరుడిని ఓ వ్యక్తి చితకబాదాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ భిండ్ జిల్లాలోని చందుపురలో జరిగింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆరు గంటల్లోనే పెటాకులైన ప్రేమ పెళ్లి!

మనసుపడిన అబ్బాయిని మనువాడితే ఆ ప్రేమికురాలి సంతోషానికి అవధలుండవు. అయితే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నప్పటికీ ఓ యువతికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కేవలం ఆరుగంటల్లో పెళ్లి(marriage lasted 6 hours) రద్దు చేసుకోవాల్సి వచ్చింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆకాశంలో అత్యంత దగ్గరగా వచ్చిన విమానాలు.. అదృష్టవశాత్తూ...

గుజరాత్​ నుంచి దక్షిణ భారత దేశానికి వచ్చే రెండు విమానాలు ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​ హెచ్చరికలను పాటించకుండా, ప్రమాదకర రీతిలో ప్రయాణించాయని ఎయిర్​ క్రాఫ్ట్​ యాక్సిడెంట్​ బ్యూరో తెలిపింది. అంతేగాకుండా ఎయిర్​ ట్రాఫిన్​ను అంచనా వేయడంలో ముంబయి ఎయిర్​పోర్ట్​ కూడా విఫలమైనట్లు పేర్కొంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భయపడినట్టే అయింది.. ఆ విమానాల్లో విదేశాలకు తాలిబన్లు!

అఫ్గాన్​ సంక్షోభం నేపథ్యంలో కాబుల్​ విమానాల(Kabul airport) నుంచి ఇతర దేశాలకు తాలిబన్లు(taliban news) కూడా వెళుతున్నారన్న ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశానికి వచ్చిన అఫ్గాన్​వాసుల్లో ఓ వ్యక్తికి తాలిబన్లతో సంబంధం ఉన్నట్టు అనుమానించారు ఫ్రాన్స్​ అధికారులు. వెంటనే అతడిని అరెస్ట్​ చేశారు. విచారణలో ఆ వ్యక్తి నిజనాన్ని అంగీకరించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అట్టహాసంగా పారాలింపిక్స్​ ప్రారంభోత్సవ వేడుక

టోక్యో పారాలింపిక్స్ (Tokyo Para Olympics) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆరంభ వేడుకల్లో (Tokyo Para Olympics opening ceremony) జావెలిన్​ త్రోవర్​ టెక్​ చంద్​(Athlete Tek Chand) తివర్ణ పతాకం చేతబూని జట్టును ముందుకు నడిపించాడు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దుశ్యంతుడి పాత్ర పూర్తి.. 'పుష్ప' ఆల్ ఇండియా రికార్డు

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' సినిమాలో దుశ్యంతుడి పాత్ర చిత్రీకరణ పూర్తయింది. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప'లోని 'దాక్కో దాక్కో' సాంగ్ రికార్డుల పరంపర కొనసాగుతోంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details