- 'పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి.. సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్'
పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి.. దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- AMARAVATI LANDS: అమరావతి భూములపై విచారణ 22కు వాయిదా
అమరావతి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణ వాయిదా పడింది. జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పెందుర్తిలో గ్రావెల్, రాతి క్వారీల్లో తనిఖీలు.. రూ.46 కోట్ల జరిమానా
విశాఖ జిల్లా పెందుర్తి ఎస్‌ఆర్‌పురంలో 4 గ్రావెల్, రాతి క్వారీల్లో గనుల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. క్వారీలో పరిమితికి మించి తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. క్వారీ నిర్వాహకులకు రూ.46 కోట్ల జరిమానాను విధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- శాప్ మాజీ ఛైర్మన్ పి.ఆర్.మోహన్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం
శాప్ మాజీ ఛైర్మన్ పి.ఆర్.మోహన్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రోత్సాహానికి మోహన్ కృషి చేశారని గుర్తు చేశారు. పి.ఆర్.మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సోషల్ మీడియాకు భయపడి పెళ్లి రద్దు!
హిందూ వధువు, ముస్లిం వరుడికి మధ్య జరగాల్సిన వివాహం సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత కారణంగా నిలిచిపోయింది. లవ్ జిహాద్ అంటూ పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం కాగా.. ఈ మతాంతర వివాహాన్ని ఆపేస్తున్నట్లు వధువు తండ్రి.. కమ్యూనిటీ పెద్దలకు లేఖ రాశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు