- రాష్ట్రంలో కొత్తగా 2,930 కరోనా కేసులు, 36 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,930 కరోనా కేసులు(corona cases), 36 మరణాలు(corona deaths) నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 4,346 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 35,871 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ఐఆర్ఎస్ అధికారి సుందర్ సింగ్ నివాసాల్లో సీబీఐ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు!
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై.. ఐఆర్ఎస్ అధికారి సుందర్ సింగ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖలోని ఆయన కార్యాలయం, ఇంటితోపాటు హైదరాబాద్ నివాసంలోనూ సోదాలు చేసిన సీబీఐ.. మూడున్నర కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- కొత్త ఐటీ విధానం.. 55 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కసరత్తు!
ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఐటీ విధానాన్ని రూపోందించింది. రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాల కల్పన, దేశంలో పెట్టుబడుల్లో రాష్ట్రానికి అగ్రస్థానం దక్కేలా లక్ష్యాలను నిర్దేశించింది. నూతన విధానంలో.. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అగ్రస్థానం కల్పించాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- వ్యాక్సిన్ వేయించుకోలేదని... 65 మంది వాలంటీర్ల తొలగింపు!
కర్నూలు జిల్లా ఆత్మకూరులో కరోనా టీకాలు (corona vaccine) వేయించుకోలేదని వార్డు వాలంటీర్ల (ward volunteer)ను తొలగించారు. 65 మందిని విధుల నుంచి తొలగిస్తూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. కొత్త వాలంటీర్ల కోసం సోమవారం నోటిఫికేషన్ (notification) ఇస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- హైదరాబాద్‌లో కొత్త టీకా టెస్టింగ్ సెంటర్!
నెలరోజుల్లో.. హైదరాబాద్‌లో కొత్త టీకా పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY) ప్రకటించారు. పీఎం కేర్స్ నిధులతో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ అధిష్ఠానంతో అమరిందర్ భేటీ!