- ఎస్ఈసీగా విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ వద్దు: వర్ల
విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించవద్దని... తెదేపా నేత వర్ల రామయ్య గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తన కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న శామ్యూల్‌ని ఎస్ఈసీగా నియమించాలనుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'బాలల హక్కుల పరిరక్షణలో అనంతపురం బెస్ట్'
బాలల సంరక్షణ కోసం అనంతపురం జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఆనంద్ ప్రశంసించారు. బాలల హక్కుల పరిరక్షణపై అనంతపురంలో వివిద శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారు'
25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని.. తెదేపా అధికార ప్రతినిధి మాణిక్యాలరావు అన్నారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో ఏ ముఖం పెట్టుకుని వైకాపా నేతలు ఓటు అడుగుతారని ప్రశ్నించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- విదేశీ విద్యార్థిపై దాడి.. నలుగురు యువకులు అరెస్ట్
విదేశీ విద్యార్థిపై దాడిచేసిన నలుగురు యువకుల్ని విశాఖ మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- చిదంబరం, ఆయన తనయుడికి దిల్లీ కోర్టు సమన్లు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి దిల్లీ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 7న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నిఖితా హత్యకేసు దోషులకు ఈనెల 26న శిక్ష