ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - 7pm_Topnews

.

topnews
topnews

By

Published : Sep 12, 2020, 6:59 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 9,901 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. కొత్తగా 9,901 కరోనా కేసులు నమోదవ్వగా.. మెుత్తం బాధితుల సంఖ్య 5,57,587కి చేరింది. తాజాగా మరో 67 మంది వైరస్​కు బలయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 4,846 మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఆమెపై లైంగిక వేధింపులు చేయలేదు.. అన్నీ అవాస్తవాలే: బాలకృష్ణన్

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం విషయంపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(ఎస్​ఈబీ) సూపరింటెండెంట్ బాలకృష్ణన్ స్పందించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ

సీఎం జగన్ చిన్నాన్న... వివేకా హత్య కేసులో రెండో విడత విచారణ చేపట్టింది సీబీఐ. అంతకు ముందు జులైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ప్రేమ పేరుతో వాలంటీర్​కు వేధింపులు... వైకాపా నేతపై కేసు నమోదు!

ప్రేమ పేరుతో వాలంటీర్​ను వైకాపా నేత వేధించిన ఘటన సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఫొటోలు తీస్తే రెండు వారాలు సస్పెన్షన్

సెప్టెంబర్ 9న కంగనా ప్రయాణించిన ఇండిగో విమానంలో కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ.. విమాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కరోనా జాగ్రత్తలతో నీట్​ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

కరోనా కాలంలో నిర్వహిస్తోన్న నీట్ పరీక్ష కోసం జాతీయ పరీక్షల ఏజెన్సీ(ఎన్​టీఏ) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచి.. ఒక్కో గదిలో విద్యార్థుల సంఖ్యను కుదించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ప్రపంచవ్యాప్తంగా 2.86కోట్లకు చేరిన కొవిడ్​ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 86 లక్షలు దాటింది. 9 లక్షల 20 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కరోనా వ్యాక్సిన్​ రేసులో మరో అమెరికా సంస్థ

అమెరికాకు చెందిన మరో ఔషధ తయారీ సంస్థ కరోనా టీకా రేసులో చేరింది. మెర్క్​ అండ్​ కార్పొరేషన్​ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు సిద్ధమవుతోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • వెనిస్​ ఫిలిం ఫెస్టివల్​లో సత్తా చాటిన భారతీయ చిత్రం

వెనిస్​ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో చైతన్య తమ్హానే రూపొందించిన భారతీయ సినిమా 'ది డిసిపుల్'​కు ఎఫ్​ఐపీఆర్​ఈఎస్​సీఐ అవార్డు లభించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఐపీఎల్2020: నైట్​రైడర్స్ బలాలు, బలహీనతలు ఇవే!

ఈ ఏడాది ఐపీఎల్ కోసం అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. కరోనా కారణంగా యూఏఈలో జరగబోతున్న ఈ లీగ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details