ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు@11am - top news in telugu states

.

top ten news
top ten news

By

Published : May 24, 2020, 11:00 AM IST

  • విమర్శిస్తే కేసులా?'

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తే కేసులు పెట్టడం అనేది అధికార దుర్వినియోగమని కేంద్ర మాజీ సమాచార కమిషనర్​ డాక్టర్​ మాడభూషి శ్రీధర్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...?

  • నివారణే లక్ష్యంగా..

కరోనా వైరస్‌ నివారణ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘ఇన్సిడెంట్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌’ (ఐఎంఎస్‌) వేదికగా యాప్‌లు, సహాయ ఫోన్‌ నెంబర్ల ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..!

  • మిస్టరీ డెత్స్..!

తెలంగాణ రాష్ట్రం వరంగల్​ గ్రామీణ జిల్లా గొర్లెకుంట బావి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. 9 మంది మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో ముమ్ముర దర్యాప్తు చేస్తున్నారు. కేసు వివరాలు...దర్యాప్తు తీరు, శవపరీక్షల వివరాలు తెలుసుకునేందుకు లింక్ క్లిక్ చేయండి..!

  • రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 147 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి...

  • లాభం లేదు

కొవిడ్‌-19పై పోరులో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఇక ఎంతమాత్రం భారత్‌కు ఉపయుక్తం కాదని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. సమాజ చొరవతో చేపట్టే నియంత్రణ వ్యూహాలను అమల్లో తీసుకురావాలన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే...లింక్ క్లిక్ చేయండి..!

  • ఆహారమే ఆరోగ్యం

కరోనా మహమ్మారిని జయించాలంటే పోషకాహారం తీసుకోవడం తప్పనిసరని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కొవిడ్​-19కు వ్యాక్సిన్ లేనందువల్ల... పోషకాహారం తీసుకొని వ్యాధినిరోధక శక్తి గణనీయంగా పెంచుకోవాలని సూచించింది. కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • వచ్చేసింది 'జియె మార్ట్​'..

ఇ-కామర్స్‌ పోర్టల్‌ జియోమార్ట్​ను అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్​ జియో. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా అందిస్తోంది. మరీ ఆ వివరాలెంటో చూస్తే...లింక్ క్లిక్ చేయండి..!

  • ఉపశమనం..!

రెండు నెలలుగా ఇళ్లలోనే మగ్గిపోతున్న న్యూయార్క్ వాసులకు ఉపశమనం కలిగిస్తూ.. ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు, మరణాలు క్రమంగా తగ్గుతున్నందున ఆంక్షలు సడలిస్తున్నట్లు తెలిపారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • ఆలోచనలపై గెలవాలి..

ఆధునిక కాలంలో చెస్​ ఆడే విధానమే పూర్తిగా మారిందని అభిప్రాయపడ్డాడు చెస్​ ఆటగాడు విశ్వనాథన్​ ఆనంద్​. చదరంగం అంటే కేవలం బోర్డుపై గెలవడం కాదని.. ప్రత్యర్థి ఆలోచనలపై దెబ్బకొట్టడమన్నాడు. కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • నాలో కవయిత్రి దాగుంది..!

నటి తమన్నా భాటియా తన చిన్నతనంలోని జ్ఞాపకాలను తాజాగా గుర్తు తెచ్చుకున్నారు. తన డైరీలో "నేను చాలా అయోమయంలో ఉన్నా" అనే వాక్యాన్ని ఎక్కువగా రాస్తానని వెల్లడించింది. కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

ABOUT THE AUTHOR

...view details