ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @11am - ap top news updates

.

top ten news in ap
top ten news in ap

By

Published : May 22, 2020, 11:04 AM IST

  • మృత్యుబావి

తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ‌ జిల్లాలో వలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో ఇవాళ మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు ఆ బావిలో ఏడు శవాలు దొరికాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • రికార్డు స్థాయిలో...!

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 148 మంది వైరస్​ బారిన పడి మరణించారు. రికార్డు స్థాయిలో కొత్తగా 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. రాష్ట్రాల వారీగా పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..

  • సింహాల మధ్య ప్రసవం..!

సింహాల గుంపు చుట్టుముట్టి అంబులెన్స్‌ను కదలకుండా చేయటం వల్ల ఓ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆసక్తికరమైన కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • 90 రోజులు పొడిగింపు

రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి (40 బేసిస్‌ పాయింట్లు) తగ్గించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి..

  • మరింత నష్టాల్లోకి...!

దేశీయ స్టాక్​మార్కెట్లు మరింతగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంచి సూచీ సెన్సెక్స్​ 100 పాయింట్లు కోల్పోయి 30 వేల 832 వద్ద కొనసాగుతోంది. గణాంకాల కోసం లింక్ క్లిక్ చేయండి..

  • తేలిగ్గా తీసుకోం

చైనాపై విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఆ దేశం నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్​ను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేశారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • సరైనోడు అతనే..!

అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఛైర్మన్​ పదవికి సౌరవ్​ గంగూలీ సరైన ఎంపికని అన్నాడు క్రికెట్​ దక్షిణాఫ్రికా(సీఎస్​ఏ) డైరెక్టర్​ గ్రేమ్​ స్మిత్​. దీనికి తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నాడు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • ఆడేందుకు ఓకే!

ఐపీఎల్​ నిర్వహణకు అనేక దేశాల క్రికెట్​ బోర్డుల నుంచి సహకారం కోసం అడుగులేస్తోంది బీసీసీఐ. టీ20 ప్రపంచకప్​ వాయిదా కోసం ఐసీసీలో మద్దతు కూడగట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్​ ఆడేందుకు సముఖత వ్యక్తం చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • నాకేం తెలియదు..!

రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'చంద్రముఖి' ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కబోతుంది. అయితే ఈ విషయం గురించి జ్యోతికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఏంటంటే..?

  • ప్రభాస్​తో ఆలియా..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్​గా ఆలియాను పరిశీలిస్తోందట చిత్రబృందం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

ABOUT THE AUTHOR

...view details