ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @ 9am - latest news in ap

.

andhrapradesh
andhrapradesh

By

Published : May 20, 2020, 9:01 AM IST

  • మరో అడుగు

రాష్ట్ర‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యం, నీటి మళ్లింపు సామర్థ్యాలను పెంచుతూ చేపట్టదలచిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • అమ్మకానికి సిద్ధం..!

విక్రయానికి అనువైన ప్రభుత్వ భూముల వివరాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. తొలి విడతలో విశాఖ, గుంటూరు నగరాల్లో కలిపి తొమ్మిది చోట్ల ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ వెలువడింది. మలివిడతలో మరికొన్ని ప్రభుత్వ భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ త్వరలో రానుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • మార్గదర్శకాలు విడుదల

పరిశ్రమలకు ఊరటనిచ్చేందుకు రీస్టార్ట్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను పొందటానికి మార్గదర్శకాలు మంగళవారం విడుదలయ్యాయి. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

  • తీవ్ర రూపం..!

ఒడిశాలో అంపన్​ తుపాను తీవ్ర రూపం దాల్చేలా ఉంది. ఇప్పటికే బాలాసోర్​, ఛండీపుర్​ జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు పారాదీప్ తీర ప్రాంతాన్ని​ వణికిస్తున్నాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • కీలక పదవి

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌ పదవి ఈసారి భారతదేశానికి లభించనుంది. ఆరోగ్యశాఖ మంత్రి, ఈఎన్‌టీ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఈనెల 22న ఈ పదవికి ఎన్నిక కానున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • లక్షణాలు లేకున్నా...!

కరోనా లక్షణాల్లో ప్రధానమైనవి దగ్గు, జ్వరం. ఈ లక్షణాలున్న వారిని ఇతరులతో కలవకుండా విడిగా ఉంచితే వైరస్‌ వ్యాపించకుండా ఆపొచ్చని ఇప్పటిదాకా అనుకుంటున్నాం. కానీ, కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవచ్చని.. అలాంటి వారితో వైరస్​ వ్యాప్తి మరింత పెరగనుందంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • తనయుడు కోసం సచిన్..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతడి తనయుడు అర్జున్​కు హెయిర్ కట్ చేస్తూ కనిపించాడు సచిన్. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • మరపురాని మెరుపులు

విరాట్‌లో మేటి బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు.. సాహసవంతుడైన కెప్టెన్‌ ఉన్నాడని చాటిన సిరీస్‌ అది. ఫలితం నిరాశ కలిగించినా.. సరికొత్త విరాట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఆ సిరీస్‌ను భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • బాక్సాఫీసును కొల్లగొట్టేశాడు

ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత శక్తిమంతమైన స్టార్‌ కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్‌. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా తారక్​ జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకునేందుకు లింక్ క్లిక్ చేయండి...

  • నటించాలని ఉంది

మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఉందని తెలిపారు హీరోయిన్ రమ్యకృష్ణ. అయితే సినిమాలో కాదు వెబ్​ సిరీస్​ చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

ABOUT THE AUTHOR

...view details