ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @11am - latest news in andhrapradesh

.

11am news
11am news

By

Published : May 19, 2020, 11:00 AM IST

  • నిరసనలకు పిలుపు

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నేతలు ఇళ్లల్లోనే ఉంటూ నిరసన దీక్షలు చేయాలని సూచించారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • ఎగసిపడుతున్న అలలు

శ్రీకాకుళం జిల్లాపై అంపన్ తుపాను ప్రభావం చూపుతోంది. జిల్లా అంతటా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. తుపాను ప్రభావంతో చాలా మండలాల్లో సముద్రం ముందుకొచ్చింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • 9 మంది కూలీలు మృతి!

బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. భాగల్​పుర్​ జిల్లా నౌగాచియా వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఘటనలో 9 మంది కూలీలు మృతి చెందారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • చెక్​పోస్ట్​ వేదికగా..

మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు పోలీస్​ చెక్​పోస్టే కల్యాణ మండపమైంది. పోలీసులే పెళ్లి పెద్దలయ్యారు. ఇలా చెక్​పోస్ట్​ వేదికగా జరిగిన ఆ పెళ్లి కథ ఏంటంటే...లింక్ క్లిక్ చేయండి

  • డబ్ల్యూహెచ్​ఓ ఓ కీలుబొమ్మ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోమారు విరుచుకుపడ్డారు. చైనా చేతిలో డబ్ల్యూహెచ్​ఓ కీలుబొమ్మ అని విమర్శించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • తలదూర్చం..!

పొరుగు దేశాల అంతర్గత అంశాల్లో తలదూర్చమని తాలిబన్​ రాజకీయ విభాగం ఇస్లామిక్​ ఎమిరేట్స్​ ప్రకటించింది. కశ్మీర్​ సమస్య పరిష్కారమయ్యేంత వరకు భారత్​తో సత్సంబంధాలు తెంచుకుంటున్నట్టు వస్తున్న వార్తలను ఇస్లామిక్​ ఎమిరేట్స్​ ఖండించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • లాభాల్లో మార్కెట్లు..

సోమవారం భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్​మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలు దీనికి కలిసి వచ్చాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • బోరింగ్​గా ఉంది..

"నాకు డ్రీమ్‌ రోల్స్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కానీ ప్రస్తుతం నేను చేస్తున్న 'చావు కబురు చల్లగా' చిత్రంలోని పాత్ర ఎంతో విభిన్నంగా ఉండబోతోంది" అని చెప్పింది లావణ్య త్రిపాఠి. లాక్‌డౌన్‌ సమయం చాలా బోరింగ్‌గా ఉందని తెలిపింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • వివాదంలోకి 'పాతాళ్​లోక్

బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాణంలో రూపొందిన 'పాతాళ్​లోక్' వెబ్​సిరీస్​పై సామాజిక మాధ్యమాల్లో వివాదం చెలరేగుతోంది. కారణాలు తెలుసుకునేందుకు కోసం లింక్ క్లిక్ చేయండి...

  • క్రికెట్ ఇష్టం లేదు

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి టిక్​టాక్​తో అలరించాడు. అయితే ఈసారి పాటలతోనో, డైలాగ్​లతో కాదు. క్రికెట్ బ్యాట్ పట్టి సందడి చేశాడు. అభిమానులకు సవాల్ విసిరాడు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

ABOUT THE AUTHOR

...view details