ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @11am - latest news in andhrapradesh

.

top ten news in ap
top ten news in ap

By

Published : May 18, 2020, 11:03 AM IST

  • త్వరలో నివేదన!

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, కాలువల సామర్థ్యం పెంచుతూ చేపట్టనున్న పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తన వాదనను త్వరలో కృష్ణా బోర్డు ముందుంచనుందని విశ్వసనీయ సమాచారం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • సీఎం సమీక్ష

కరోనా నివారణ వ్యాప్తి, ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం నేడు సమీక్ష నిర్వహించనున్నారు.నాలుగో విడత లాక్​డౌన్​పై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై చర్చించనున్నారు. ప్రజారవాణా వాహనాలను అనుమతించే అంశంపై చర్చించి కీలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • 'జగనన్న చేదోడు'..

రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం అందించే ‘జగనన్న చేదోడు’ పథకాన్ని జూన్‌ తొలి వారంలో ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తికావొచ్చింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • ఎండలు మండే..!

మే మూడో వారం ముగిసే సమయానికి రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల పైబడి నమోదవుతాయని నిపుణులు అంటున్నారు. రోహిణికార్తె ప్రవేశానికి ఇది 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • కరోనా కేసుల్లో ఇదో రికార్డు.

దేశంలో రికార్డు స్థాయి కరోనా మరణాలు, కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 5,242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 157 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • అగ్ర దేశాల సరసన భారత్​!

కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్​ భారత్​ అభియాన్​ పేరిట రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రకటించిన అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీలల్లో భారత్​ ఒకటి. పూర్తి కథనం కోసం లింక్ ్లిక్ చేయండి....

  • క్వారంటైన్‌ 'రాణి'

15 రోజులు క్వారంటైన్​లో ఉండాలంటేనే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఓ మహిళ రెండు ఖండాల్లో 3 నెలల వ్యవధిలో నాలుగు సార్లు నిర్బంధంలో గడపి బయటకు వచ్చింది ఆమె. ఇప్పుడు తనను సన్నిహితులంతా 'క్వారంటైన్ రాణి' అని పిలుచుకుంటున్నారు. ఆమే అమెరికన్​ జర్నలిస్టు అమిక్విన్. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • మరపురాని మెరుపులు

2007 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం. ఆ సమయంలోనే ఇంగ్లాండ్‌ పర్యటన. సొంతగడ్డపై ఆరేళ్లుగా సిరీస్‌ కోల్పోని కఠినమైన ప్రత్యర్థితో సమరం. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన భారత జట్టు ఇంగ్లాండ్‌ స్వింగ్‌ సవాల్‌కు నిలబడుతుందా? అన్న ప్రశ్నలకు రాహుల్‌ ద్రవిడ్‌ సేన దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ఆ సిరీస్‌ విశేషాలు మీకోసం! లింక్ క్లిక్ చేయండి..

  • అఫ్రిదీ.. కశ్మీర్ మాదే..!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి కశ్మీర్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై టీమ్​ఇండియా క్రికెటర్లు మండిపడుతున్నారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

  • ఆలియాకు హెయిర్ కట్ చేసిందెవరు..?

ఇంట్లోనే హెయిర్​కట్​ చేసిన తన ప్రియమైన వ్యక్తికి ఇన్​స్టాగ్రామ్​లో ధన్యవాదాలు తెలిపింది బాలీవుడ్​ నటి ఆలియా భట్​. అయితే తనకు జుత్తు కత్తిరించింది ఎవరన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది ఆలియా. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి....

ABOUT THE AUTHOR

...view details