ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు @11am - latest news in andhrapradesh

.

top-ten-news-in-andhrapradesh
top-ten-news-in-andhrapradesh

By

Published : May 17, 2020, 11:05 AM IST

  • ప్యాకేజీ వినియోగానికి...

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర స్థాయి కమిటీను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • కోయంబేడు చిచ్చు

రాష్ట్రంలో ప్రస్తుతం కోయంబేడు మార్కెట్‌ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రారంభంలో చిత్తూరు, నెల్లూరు వంటి సరిహద్దు జిల్లాలకే ఇది పరిమితమైనా తర్వాత అన్ని జిల్లాలకూ విస్తరించింది. శనివారం రాష్ట్రంలో 48 మందికి కొత్తగా వ్యాధి సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 31 మంది కోయంబేడు వెళ్లి వచ్చినవారే. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • కొత్త రికార్డ్

కరోనా మహమ్మారి దేశంలో మరింత వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 120 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 81,970కి చేరింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..

  • కరోనా ప్యాకేజ్​ 4.0 హైలైట్స్​

ఆర్థిక స్వావలంబన సాధనకు ప్రముఖ రంగాల్లో సంస్కరణలు చేపట్టడమే మార్గమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధికి ఊతం, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంతో కరోనా ప్యాకేజ్​ 4.0ను ఆవిష్కరించింది కేంద్రం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • సైబర్​ మోసగాళ్ల పంజా

లాక్​డౌన్​తో ప్రజలు ఇంటిపట్టునే ఉండటం వల్ల స్మార్ట్​ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ​దీనిని ఆసరాగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు యాప్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • 'అంబులెన్స్​ మ్యాన్​' కథ

హిమాన్షు కలియా.. తన ఆశయంతో ఎందరికో ప్రాణాలు పోస్తున్న దిల్లీవాసి. ఆపదలో ఉన్న వారికి ఉచితంగా సేవలందిస్తూ.. "అంబులెన్స్​ మ్యాన్"​గా ప్రసిద్ధి చెందారు. అయితే ఆయన జీవితాన్ని ఓ సంఘటన మార్చేసింది. ఏంటా సంఘటన? ఆయనకు అంబులెన్స్​ మ్యాన్​ అని పేరెలా వచ్చింది?పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • లాక్​డౌన్​కు స్వస్తి

వేసవిలో పర్యటక సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో లాక్​డౌన్​కు ముగింపు పలికేందుకు సిద్ధమైంది ఇటలీ. వచ్చే నెలలో తమ సరిహద్దులను తెరిచేందుకు నిర్ణయించింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

  • 'హైటెన్షన్'​ డే!

ఈ గజి'బిజీ' జీవితమే ఓ టెన్షన్​గా మారిపోయింది​. సమయానికి తిండి కూడా తినలేనంత టెన్షన్​తో గడిచిపోతోంది. ఎవరిపై చూపాలో తెలియని కోపతాపాలు, నిరాశ నిస్పృహల టెన్షన్​తో నరనరాల్లో రక్తం మరిగిపోతోంది. ఇంకేముంది, హైపర్​టెన్షన్ మొదలవుతుంది. అందుకే, ప్రపంచమంతా నేడు హైపర్​టెన్షన్​ డే జరుపుకోవాల్సి వచ్చింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • అందుకే మారా

చీరలో ఉన్న అందం, సౌకర్యం.. ఆధునిక దుస్తుల్లో ఉండదంటోంది హీరోయిన్​ రష్మిక. లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ అందాల భామ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో దగ్గరగా ఉంటోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • అత్యంత స్వార్థపరుడు

తనతో ఇప్పటివరకు ఆడిన ఆటగాళ్లలో దిగ్గజ క్రికెటర్​ స్టీవ్​ వా అత్యంత స్వార్థపరుడని అంటున్నాడు ఆసీస్​ మాజీ స్పిన్నర్​ షేన్​ వార్న్. ఎందుకో తెలుసా..!లింక్ క్లిక్ చేయండి....

ABOUT THE AUTHOR

...view details